స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం సదస్సులో ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి పోవడానికి, ఈనాడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణం అంటూ ఆయన విమర్శించారు.
ఈ సంవత్సరం వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. ఈనెల 19వ తారీఖున సాంప్రదాయబద్దంగా గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది.
నర్సాపూర్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21న ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో నర్సాపూర్ టికెట్ పెండింగ్ లో పార్టీ అధిష్టానం పెట్టింది. గత వారం నుంచి ఎమ్మెల్యే వరుసగా ఆందోళనలు చేస్తున్నారు.
వీలైనంత త్వరగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంశం రాష్ట్ర స్థాయిలో చర్చలు జరగడం లేదు అని ఠాక్రే తెలిపారు.
ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేష్టలు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కనిపించగా.. సాయత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, హిమాయత్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.