YS Jagan: భూముల రీ సర్వేలో నిజాలను తొక్కిపెట్టలేరు..!
- భూముల రీ సర్వేపై సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు..
- రీ సర్వే క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని..
- వైసీపీ హయాంలో ఇచ్చిన భూ పాసు పుస్తకాలే కొనసాగుతున్నాయి
- యూనిక్ నెంబర్, QR కోడ్ అదే ఉంచి రంగు మాత్రమే మార్చారు
- కొత్త పాస్ పుస్తకాలలో అనేక తప్పులు ఉన్నాయని..
- పాత సర్వే రాళ్లపై పేర్లు చెరిపేందుకు కోట్ల ఖర్చు చేస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేకు సంబంధించిన క్రెడిట్‌ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా?అంటూ ప్రశ్నించారు.
భూముల రీ సర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని.. అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు 40 వేల మందికి శిక్షణ ఇచ్చామని జగన్ తెలిపారు. కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను గ్రామాలకు తరలించి కేవలం 5 cm తేడా కూడా లేకుండా కొలతలు వేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాల పరిష్కారం కోసం 1,358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఏడుగురు సజీవదహనం
భూసర్వే కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 2020 డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో అధికారిక ఒప్పందం చేసుకున్నామని జగన్ గుర్తుచేశారు. భూ సర్వే ప్రక్రియలో 3,640 GNSS పరికరాలు వినియోగించామని తెలిపారు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించిందని.. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల అధికారులు ఈ సర్వే విధానాన్ని అధ్యయనం చేసి మెచ్చుకున్నారని వెల్లడించారు. అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కూడా ఈ ప్రక్రియను ప్రశంసించారని తెలిపారు. అసోం రాష్ట్రం సైతం తమ ప్రభుత్వ సహకారం కోరిందన్నారు.
ఎన్నికల సమయంలో IVRS కాల్స్ ద్వారా రైతులను భయపెట్టారని, మీ భూములు మీకు దక్కవని దుష్ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యల వల్లే కేంద్రం నుంచి రూ. 400 కోట్ల రాయితీ వచ్చిందని, భూముల రీ సర్వేకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఈ రీ సర్వేకు ఏపీకి కేంద్రం నుంచి “ప్లాటినమ్ గ్రేడ్” దక్కిందని పేర్కొన్నారు.
YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!
వైసీపీ హయాంలో ఇచ్చిన భూ పాసు పుస్తకాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని జగన్ అన్నారు. యూనిక్ నెంబర్, క్యూఆర్ కోడ్ అన్నీ అదే ఉంచి, కేవలం పాస్ పుస్తకాల రంగు మాత్రమే మార్చి ఇస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు కొత్తగా చేసింది ఏమీ లేదని.. రంగులు మార్చడం తప్ప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పాస్ పుస్తకాల్లో అనేక తప్పులు దొర్లుతున్నాయని, వైసీపీ హయాంలో పాతిన కొలత రాళ్లపై ఉన్న పేర్లను చెరిపేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!