నో డౌట్..! ఆయన సహకరిస్తారు.. గన్నవరంలో గెలుపు వైసీపీదే..
గన్నవరంలో తాజా రాజకీయ పరిస్థితులతో అప్రమత్తమైన వైసీపీ.. ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది.. వైసీపీ గుడ్‌బై చెప్పి యార్లగడ్డ వెంకట్రావ్.. తెలుగుదేశం పార్టీలో చేరాడు.. ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, క్యాడర్ కూడా సైకిల్ ఎక్కింది.. దీంతో.. దిద్దుబాటు చర్యలకు దిగింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా ఎంపీ బాలశౌరిని రంగంలోకి దించింది.. వైసీపీ అసంతృప్త నేత దుట్టా రామచంద్రరావుతో చర్చలు జరిపారు బాలశౌరి.. ఆయన కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం ఓవైపు సాగుతుండగా.. ఆయన్ని బుజ్జగించి.. వైసీపీలో కొనసాగే దిశగా చూసేందుకు ఈ సమావేశం జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఇక, ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ బాలశౌరి.. వైసీపీ గన్నవరంలో మళ్లీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి దుట్టా సహాయ, సహకారాలు ఉంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఎంపీ బాలశౌరి.. వైసీపీ పుట్టినప్పడే దుట్టా పార్టీలో చేరారని గుర్తుచేసిన ఆయన.. కార్యకర్తలు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోసం పనిచేశారు.. వైఎస్‌కి రాష్ట్రంలో ఉన్న అత్యంత సన్నిహితుల్లో దుట్టా రామచంద్రరావు ఒకరు అని తెలిపారు. దుట్టా పార్టీకి విధేయులు.. సీఎం వైఎస్ జగన్, పార్టీ కోసం ఆయన పని చేస్తారు.. అందులో నో డౌట్ అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చేయాల్సిన వరకు చేశారు. వేరే వాళ్లు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.. పార్టీకి ఏ అవసరం, జగన్ కి ఏ అవసరం ఉన్నా పార్టీ కోసం ఆయన పనిచేస్తారని తెలిపారు. ఇక, ఎంపీగా నాకు 10 వేల మెజార్టీ వచ్చింది.. పార్టీ మళ్లీ ఇక్కడ గెలిచేలా పనిచేస్తామని తెలిపారు ఎంపీ బాలశౌరి.
నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఈసారి గతంకంటే ఎక్కువ సీట్లు..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతో డబ్బులు వసూలు చేశారా లేదా.. ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అని ప్రశ్నించారు. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఇసుక పాలసీ తీసుకు వచ్చింది.. కేంద్ర ప్రభుత్వం కు చెందిన ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు పిలిచాం అని తెలిపారు. అయితే, 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకం తెచ్చింది లేదని విమర్శించారు. చంద్రబాబు ఇసుక టెండ లో పాల్గొనాలి.. 375 రూపాయలు టన్నుకు కేటాయించాం, అదనంగా వంద రూపాయలు మేయింటేన్స్ చార్జెస్ పెంచి 475 కు అందుబాటులో తెచ్చారని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం పేరు చెప్పి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేశారా లేదా చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇసుక తీస్తే 100 కోట్లు ఎన్‌జీటీ ఫైన్ వేసిందన్నారు పెద్దిరెడ్డి.. అధికారులపై చర్యలు తీసుకుంటే.. సెక్రటేరియట్ లో పంచాయితీ చేసి పంపించారు.. ఇసుక పేరుతో నీ పాలనలో దోచుకున్నది ప్రజలకు చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. నువ్వు నీ కుమారుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు ఇసుక తరలించ లేదా..? అని ప్రశ్నించారు. నీ పాలనలో ఉచిత ఇసుక పేరుతో వేల కోట్లు పక్కదారి పట్టాయి.. ఇసుక కాట్రాక్టర్ కు అప్పగించారు, నిర్వహణ బాధ్యత వాళ్లది.. నువ్వు అల్టిమేటం ఇస్తే.. లేని పోని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల్ని పక్కదారి పట్టించి అధికారంలోకి రావాలని చూస్తున్నారని దుయ్యబట్టిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2018-19లో 60 దొంగ ఓట్లు టీడీపీలో హయాంలో 60 లక్షలు ఓట్లు చేర్చారు.. దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియ చేపట్టాం, మా పార్టీ ఎంపీలు కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లాం.. కేంద్రం హోం మంత్రిని కలుస్తున్నారు.. 36 వేల దొంగ ఓట్లు కుప్పంలో చేర్చారు.. గత ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
స్టీల్‌ప్లాంట్‌పై కేఏ పాల్ డెడ్‌లైన్.. లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష..!
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.. అయితే, దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు సాగుతున్నాయి.. ఇప్పుడు సీన్‌లోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వచ్చారు.. స్టీల్ ప్లాంట్ ను అమ్మబోమని కేంద్రం అధికార ప్రకటన చేయకపోతే.. సోమవారం నుంచి ఆమరణనిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. కేంద్రం మన రాష్ట్రానికి ఏమీచేయకుండా మొండి చేయి చూపించిందని ఆరోపించిన ఆయన.. మనం కట్టిన పన్నులను గుజారత్ కు తరలిస్తున్నారు.. ఒక్క స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటే మన రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. నాకు అనుమతిస్తే 4000 కోట్ల రూపాయలు నేను సమకూర్చుతానని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నరేంద్ర మోడీతో కలిసి వెళ్తానంటున్నారు.. పవన్ ఎవరు ప్యాకేజిస్తే వాళ్లతో వెళ్తున్నారంటూ అనేకమంది విమర్శలు చేస్తున్నారు. కానీ, పవన్ నాతో చేయి కలిపితే నేను గెలిపిస్తానని ప్రకటించారు పాల్.. దోపిడీదార్లను తరిమికొట్టేందుకు తెలుగు వారందరూ కలిసి రావాలని పిలుపునిచ్చిన ఆయన.. నాకు అవకాశం ఇస్తే పదిలక్షల కోట్లు అప్పులు తీరుస్తాను.. పది లక్షల ఉద్యోగాలు ఇస్తాను.. 2 లక్షల మంది స్టీల్ ప్లాంట్ ఓటర్లు ఒక్క సారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నన్ను ఎంపీగా గెలిపిస్తే గంగవరం పోర్టును సీజ్ చేస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు.. అదానీపరం కాకుండా ఆపి తెలుగుసత్తా చూపిస్తానన్న ఆయన.. ప్రాణం పెట్టడానికి వచ్చాను.. ప్రాణం పోయేలోపు తెలుగువారి సత్తా చూపిస్తాను అన్నారు. ఒక సంవత్సరం పాటు స్టీల్ ప్లాంట్ అమ్మమని చెప్పగలరా..? లాభాల బాటపట్టిస్తాను అంటూ సవాల్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.
ఇదేందయ్య ఇది.. ఏకంగా చంద్రుడిపై స్థలం కొని తల్లికి గిఫ్ట్ ఇచ్చిన కూతురు..
తనను అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లికి ఓ కూతురు వెరైటీ గిఫ్ట్ ఇచ్చింది. అయితే.. చిన్నప్పుడూ చందమామ రావే..జాబిల్లి రావే.. అంటూ తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన అమ్మకి చందమామపైనే స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాడంతో.. అదే రోజునే తన తల్లి పేరు మీద ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో నివాసం ఉండే సింగరేణి కార్మికుడు సుద్దాల రాంచందర్, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు.. వీరిలో పెద్ద కూతురు సాయి విజ్ఞత ఉన్నత చదువులు చదివి యూఎస్ లో స్థిరపడింది. అక్కడి గవర్నర్ కిమ్ రెనాల్డ్స్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా వర్క్ చేస్తుంది. అమెరికా వెళ్లినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం నాడు తన తల్లికి ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తూ ఉండేది సాయి విజ్ఞత. కానీ, అది సాయి విజ్ఞతకు సంతృప్తిని ఇవ్వకపోవడంతో.. కన్న తల్లికి ఏదైనా అరుదైన కానుక ఇవ్వాలని అనుకుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వనటువంటి బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్న టైంలో 2022లో చంద్రుడిపై స్థలాలను అమ్ముతున్నట్లు తెలుసుకుంది.
మాస్కోలో డ్రోన్ దాడి.. 3 విమానాశ్రయాలు మూసివేత
రష్యా రాజధాని మాస్కోలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధాని మాస్కోలోని మూడు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడగా.. గత కొన్ని వారాలుగా డ్రోన్‌ల ద్వారా రాజధాని మాస్కో , పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సరిహద్దులో పోరాటం చేయగా.. క్రమంగా మాస్కోకు చేరుకుంది. ఈ దాడుల్లో డ్రోన్లు అతిపెద్ద ఆయుధంగా మారాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ఫిబ్రవరిలో ప్రారంభం కాగా.. ప్రారంభంలో రష్యా యుద్ధంలో పెద్ద ఎత్తున విజయం సాధించింది. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఉక్రెయిన్ యుద్ధ దిశను మార్చే పనిలో పడింది. ఇప్పుడు రష్యా నగరాలను ఉక్రెయిన్ డ్రోన్లతో టార్గెట్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా మాస్కో నగరాన్ని టార్గెట్ చేస్తున్నారు. క్రిమియాలో 42 డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ఇటీవలే చెప్పడంతో దీనిని అంచనా వేయవచ్చు.
కరెంటు కోతలతో కెన్యా అతలాకుతలం.. 14 గంటలు చీకట్లోనే..
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కరెంటు కోతతో దేశం మొత్తం అతలాకుతలమైంది. కెన్యాలో శుక్రవారం రాత్రి విద్యుత్ నిలిచిపోయింది. ఏకంగా 14 గంటల పాటు కరెంటు కటకట ఏర్పడింది. ఇటీవలి సంవత్సరాలలో దేశంలోనే అత్యధిక విద్యుత్ కోత ఇదేనని ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది. శుక్రవారం రాత్రంతా ఆ దేశ పౌరులు అంధకారంలోనే గడిపారు. కెన్యా రాజధాని నైరోబీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా గంటల తరబడి మూసివేశారు. ఆస్పత్రులు, ఆఫీసులు, చివరకు దేశాధ్యక్ష కార్యాలయ ప్రాంగణానికి కూడా విద్యుత్ కష్టాలు తప్పలేదు. అయితే విద్యుత్ కోతపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి వివరణ లేదు. కెన్యా రవాణా మంత్రి కిప్చుంబా ముర్కోమెన్ అర్ధరాత్రి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, “జరిగిన దానికి నిజంగా చింతిస్తున్నట్లు,విమానాశ్రయం చీకటిలో ఉండటానికి ఎటువంటి కారణం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే దేశంలోని చాలా ప్రాంతాలకు విద్యుత్‌ను పునరుద్ధరించినట్లు కెన్యా ప్రభుత్వ విద్యుత్ సంస్థ వెల్లడించింది. విద్యుత్ వ్యవస్థలో లోపాల కారణంగానే అంతరాయం ఏర్పడినట్లు ప్రాథమికంగా తెలిపింది. 5 కోట్లకుపైగా జనాభా కలిగిన కెన్యా.. పునరుత్పాదక వనరుల నుంచే దాదాపు మొత్తం కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. నిర్వహణ లోపాల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి.
ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఇంటి అద్దె తెలిస్తే షాకే.. ఓ పది ఇళ్లు కొనేయొచ్చు..!
జెఫ్ బెజోస్ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియా కాపురం పెట్టారట.. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీకి చెందిన ఈ భవనం 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట.. ఎన్నో ప్రత్యేకతలు ఈ భవనం సొంతం.. రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్, గార్డెన్స్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.. ఇందులో 3,500 చదరపు అడుగుల గెస్ట్‌హౌస్ కూడా ఉంది. అందుకే అదేస్థాయిలో దీని అద్దె కూడా వసూలు చేస్తున్నారు.. నెలకు 600000 డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు అద్దెగా చెల్లిస్తున్నారట జెఫ్ బెజోస్.. జెఫ్ బెజోస్ జంట ఈ సంవత్సరం మార్చి నుండి ఈ ఆస్తిని అద్దెకు తీసుకున్నారు. అద్దె నెలకు సుమారు రూ. 5 కోట్లుగా ఉండగా.. బెజోస్ మరియు అతని కాబోయే భార్యకు చెందిన వస్తువులతో అలంకరించబడిందట.. ఈ బిలియనీర్ జంట మాలిబు మాన్షన్‌ను అద్దెకు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది, అయితే బెజోస్ స్వంత బెవర్లీ హిల్స్ ఆస్తి పునర్నిర్మాణంలో ఉంది. అందుకే ఇక్కడ అద్దెకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ లాంటి సిటీల్లో శివారు ప్రాంతాలకు వెళ్తే.. రూ.50 లక్షల వరకు ఇళ్లు కూడా దొరికే పరిస్థితి ఉంది.. ఈ లెక్కన.. జెఫ్ బెజోస్ చెల్లించే అద్దెతో ఇక్కడైతే ఏకంగా పది ఇళ్లకు పైగా కొనుగోలు చేయవచ్చన్నమాట..
హీరోను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి.. ఆ పని చేయకపోతే చెయ్యి కోసుకుంటా అంటూ
టాలీవుడ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మా అనుకుంటే .. వాళ్లని చచ్చేవరకు వదిలిపెట్టరు. ఇక సోషల్ మీడియాలో స్టార్లు పెట్టే పోస్టులకు.. అభిమానులు కామెంట్స్ చేయడం .. తిరిగి వారిని రిప్లై ఇవ్వమని అడగడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక హీరో అభిమాని మాత్రం రిప్లై ఇవ్వకపోతే చెయ్యి కోసుకుంటా అని బెదిరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. యంగ్ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఈ హీరో చాలా ఏళ్ళ తరువాత బెదురులంక 2012 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే కార్తికేయకు తన ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా కార్తికేయ ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించాడు. అభిమానుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు. అయితే ఈ చిట్ చాట్ సెషన్ లో ఒక యువతి.. ” కార్తికేయ నాకు రిప్లై ఇవ్వకపోతే చెయ్యి కోసుకుంటా” అని రాసుకొచ్చింది. దాన్ని చూసిన కార్తికేయ.. ” అయ్యో వద్దు .. వద్దు” అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ యువతి సరదాగానే అన్నా కూడా.. నెటిజన్స్ సైతం వద్దు.. అంత పని చేయకు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక కార్తికేయ సినిమాల విషయం కొస్తే .. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో కుర్రహీరో జోరు పెంచుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరో రెండు సినిమాలను అనౌన్క్ చేయనున్నట్లు సమాచారం. మరి ముందు ముందు కార్తికేయ ఎలాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
అక్కా అంటూనే నన్ను అసభ్యంగా టచ్ చేశాడు.. దుల్కర్ కూడా అలానే
సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం గృహాలక్ష్మి సీరియల్ లో నటిస్తూ బిజీగా మారింది. ఈ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కస్తూరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మనసులో ఏది ఉంటె అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు ఆ మాటల వలన వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక తాజాగా కస్తూరి తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. సెలబ్రిటీలను రియల్ గా చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు అన్న విషయం తెల్సిందే. వారిని తాకాలని, వారితో ఫోటో దిగాలని గుంపులో తోసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది అయితే.. వారి మీద పడిపోయి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేస్తారు. ఇది చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న సమస్య. అయితే స్టేజిపై ఇలాంటివి ఎవ్వరు మాట్లాడారు. కానీ, చాలాతక్కువమంది ఈ విషయాలను పంచుకుంటారు. ఈ మధ్యనే ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఒక మహిళ తన ఫ్యాన్ అని చెప్పుకుంటూ వచ్చి.. తనను బుగ్గపై ముద్దు పెట్టాలని చాలా ప్రయత్నించింది. గతంలో కూడా ఒక పెద్దావిడ తనను అసభ్యంగా తాకుతూ నన్ను చిరాకు పెట్టింది అని తెలిపాడు. ఇక ఇప్పుడు అలానే తనకు అయ్యిందని కస్తూరి చెప్పుకొచ్చింది. “కోలీవుడ్‌లో స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్ కు రమ్మని నాకు పిలుపు వచ్చింది. ఈవెంట్ అయ్యాక కూడా చాలామంది ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు. ఇక నేను బయటికి వెళదామని ముందుకు కదులుతుంటే.. ఎవరో నా బ్యాక్ ను నొక్కుతున్నట్లు అనిపించింది. అది జరిగినప్పుడు మా నాన్న నా పక్కనే ఉన్నారు. వెంటనే ఆ చేయి పట్టుకొని ముందుకు లాగాను. ఇక వాడు నన్ను చూడగానే.. అక్కా.. సారీ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఇలాంటి చెత్తపనులు చేసి దొరికిపోయి.. అక్కా అని వేడుకోవడం చాలా దరిద్రం.. అలంటి పనులు చేయడమెందుకు.. ” అని చెప్పుకొచ్చింది.
థియేటర్లలో విడుదలైన వారంలోనే ఓటీటీకి వచ్చేసిన ‘పిజ్జా 3’.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో థియేటర్స్ లో విడుదలైన సినిమా ఓటీటీలోకి రావడానికి కొంత సమయం పడుతోంది. మినిమమ్ నెల గ్యాప్ లేకుండా సినిమాలో ఓటీటీలో రిలీజ్ అవడం లేదు. అయితే అనూహ్యంగా థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది లేటెస్ట్ హారర్ మూవీ. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంటుగా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో చెప్పలేదు కదా అదేనండీ ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకత్వంలో అశ్విన్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్స్ లో విడుదలై తమిళంలో పర్వాలేదనిపించుకున్నా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ‘పిజ్జా’ అనే సినిమాకి ఇది మూడవ భాగం కాగా తిరు కుమార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సివి కుమార్ నిర్మించారు. థియేటర్లో విడుదలై వారం రోజులు అవకముందే ఓటీటీలో రావడం గమనార్హం. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 25 నుంచే అంటే నిన్నటి నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేయడం విశేషం. ఇక తెలుగుతో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సో థియేటర్లో ఈ సినిమాని చూడని వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చూసేసి భయపడవచ్చని చెబుతున్నారు సినిమా చూసిన వారు. కనెక్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి సంస్థ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గౌరవ్ నారాయణ్, అభిషేక్ శంకర్, కాళీ వెంకట్, అనుపమ కుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించగా అశ్విని హేమంత్ సంగీతం అందించారు. సినిమాలో నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పక తప్పదు.