భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అర డజన్ కు చేరగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతారనే సంకేతాలు వస్తూన్న నేపథ్యంలో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Sonia Gandhi: వీడియో: శ్రీనగర్ లో సోనియా గాంధీ బోట్ రైడ్
అయితే, వేముల వీరేశం పార్టీలోకి వస్తే నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్ ఏం చేయాలి.. వేముల వీరేశం టికెట్ ఆశిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలోకి ఆహ్వానించి నకిరేకల్ నుంచి బరిలోకి దింపితే.. ఎలా వ్యవహరించాలి… ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి కార్యకర్తల అభిప్రాయాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సోమవారం మండలాల వారిగా కూర్చుని మాట్లాడుకుందాం.. అదే రోజు నిర్ణయం తీసుకుందాం అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Venky Re Release: గజాలా గెట్ రెడీ.. వెంకీ మళ్లీ వస్తున్నాడు!
సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి కార్యకర్తలు ఇబ్బందిపడొద్దు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎవరో వస్తున్నారు అనే మాటలు, కథనాలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దు.. మీరు ఎవరి పేరు సూచిస్తే వారిని అభ్యర్థిగా ప్రకటిస్తా.. రేవంత్ ఉచిత విద్యుత్ పై నోరు జారితే.. లాగ్ బుక్ బయట పెట్టింది నష్ట నివారణ చేశాని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని భువనగిరి ఎంపీ అన్నారు. బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడం వల్లే కాంగ్రెస్ లోకి వస్తా అంటున్నాడు అని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. పార్టీ విడిచి వెళ్ళని వారు, కబ్జాలకు, బెదిరింపులకు, పాల్పడని వారు కావాలి.. శాంతియుత నకిరేకల్ నియోజకవర్గమే నా లక్ష్యం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.