మహబూబాబాద్ లో బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కమిటీ ఛైర్మన్, హూజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. సెకండ్ ఎఎన్ఎంల దీక్ష 11 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపాడు. మహబూబాబాద్ లో ఈటలకు బీజేపీ గిరిజన మెర్చా రాష్ట్ర ఆధ్యక్షుడు జాటోత్ హూస్సేన్ నాయక్, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇక, ముత్యాలమ్మ తల్లి గుడిలో ఆయన ప్రత్యేక పూజాలు చేశారు. సెకండ్ ఎఎన్ఎంల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.
Read Also: PM Modi: ప్రసంగం మధ్యలో ఆపేసిన ప్రధాని మోడీ.. కారణమేంటంటే..!
సెకండ్ ఎఎన్ఎం ల ఊసురు ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగులుతుంది అని ఈటెల రాజేందర్ అన్నారు. రేపు ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఖమ్మం సభలో వివిధ పార్టీలకు చెందిన వందల మంది ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కి బుద్ది చేప్పుతం.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయ్యేది బీజీపీ ప్రభుత్వమని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ది చేప్పటానికి సిద్దంగా వున్నారు.. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేరు.. అందుకే బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు.. బీఆర్ఎస్ లో ప్రకటించిన ఎమ్మెల్యేల ఆభ్యర్ధలు భూ సెటిల్ మెంట్.. దందాలు చేసే వాళ్ళుకే టిక్కెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.
Read Also: Raksha Bandhan Festival 2023: రాఖీ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30 లేక 31?.. ఏ రోజు రాఖీ కట్టాలంటే?
సిటింగులకు సీట్లు ఇయ్యకుంటే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని అందరికీ కేసీఆర్ సీట్లు కేటాయించాడని ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ర్టంలో రుణమాఫీ ఆన్నాడు అవి వడ్డీ కూడా సరిపోవడం లేదు.. తెలంగాణలో ప్రధాన మంత్రి, నడ్డ, అమిత్ షాతో ఏడు ఎనిమిది మీట్టింగ్ లకు ఏర్పాటు చేస్తున్నాం.. రైతుబంధు పెట్టిన తర్వాత అన్ని స్కీం బంద్ చేశాడు అని ఆయన పేర్కొన్నాడు. బీజేపీ ఎన్నికలకు సిద్దంగా ఉంది.. కేసీఆర్ డబ్బును, మద్యాన్ని నమ్ముకున్నారు.. బీజేపీ 42 సంవత్సరాల చరిత్రకలిగిన పార్టీ.. తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్ హామీలు ఇస్తారు..
అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అంటున్నారు.. కానీ, ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేయించారు.. వడ్ల కొనుగోళ్ల చేయక రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఈటెల రాజేందర్ ఆరోపించారు.