తెలంగాణలో గురువారం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయించాయి.. అవి తమ దృష్టికి రాగానే ఈవీఎంలను మార్చినట్లు పేర్కొన్నారు.
ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు: నాగార్జున సాగర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాగర్ నీటి కోసం ఏపీ, తెలంగాణ పోలీసుల వివాదం తారాస్థాయి చేరుతున్నాయి. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల అధికారులపై తెలంగాణ ఎస్పీఎఫ్ను ప్రయోగించారు. అర్థరాత్రి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, ఏపీ పోలీసులు అనుమతి లేకుండా డ్యాం వద్దకు…
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఉద్రక్తతపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు.. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు.
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సాయి అనే యువకుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కామంతో కళ్ళుమూసుకోపోయి మానవ మృగంలా వ్యవహరించాడు.
దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో ఎమ్మెల్యే వెళ్లారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ వోజ్జల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం కనిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని…
10 special trains Between AP and Telangana: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు డిసెంబర్ 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్ (07481) రైలు డిసెంబర్ 3-31 వరకు ప్రతి ఆదివారం, హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి…
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. నిన్న రాత్రి ఏపీ పోలీసులు మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి 13 గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు.