ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్‌కు తెలియజేయాలని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మొత్తం రెడీ అయింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ కాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను చెప్పానని.. వచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని అన్నారు. డిసెంబర్ 3 నుండి పండగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో.. 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల సమావేశాన్ని కేంద్ర జల శక్తి శాఖ చేపట్టనుంది.
Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీపై నేడు కేంద్ర జల విద్యుత్ శాఖ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రమ శక్తి భవన్లో కేంద్ర జల విద్యుత్ శాఖ అధికారులు, తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య హైబ్రిడ్ విధానంలో సమావేశం కానున్నారు.
రేపు భాతర దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెలలో జరిగిన తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. అయితే, మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది.