Ambati Rambabu: సాగర్ నుంచి నీటిని తీసుకోవాలంటే తెలంగాణ పర్మిషన్ కావాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఉద్రక్తతపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు.. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. సాగు నీరు కోసం పదే పదే తెలంగాణ రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అంటూ మండిపడ్డారు. మా వాటాకు మించి ఒక్క నీటి చుక్క వాడుకోలేదు.. ఇది చాలా సున్నీతమైన అంశం, గొడవలు అవసరం లేదు.. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేశారు అంటూ ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Bank Holidays: డిసెంబర్‌లో 18 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి జాబితా ఇదే!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
గతంలో చంద్రబాబు సర్కార్ ఫెయిలైతే.. ఇప్పుడు జగన్ సర్కార్ సక్సెస్ అయింది అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ వివాదం చంద్రబాబు టైమ్ లోనూ జరిగింది.. సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధం.. మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలి.. పురంధేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు.. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అసమర్థత వల్ల తెలంగాణ పోలీసులు.. ఏపీ భూభాగంలోకి వచ్చారు.. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, ఓడించాల్సిన అవసరం మాకు లేదు.. తెలంగాణ రాజకీయాలపై మాకు ఆసక్తి లేదు.. ఎవరు అధికారంలోకి వచ్చిన మాకు సంబంధం లేదు.. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ కు చంద్రబాబు మద్దతు ఇచ్చారా?.. చంద్రబాబుకు చెందిన కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!