Telangana Assembly Elections 2023: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి రేపుతున్నాయి.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.. అత్యంత ఉత్కంఠగా మారిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీకే జైకొట్టినా, మరికొన్ని మాత్రం అధికార పార్టీకే వీర తిలకం దిద్దాయి. ఇంకొన్ని హంగ్ తప్పదని ఢంకా బజాయిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం కొంచెం ఇష్టం. కొంచె…
తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ 63–73 స్థానాలతో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ శుక్రవారం అంచనా వేసింది.
తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం) జరగనుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఇవాళ సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసుపై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి విజ్ఞప్తి మేరకు ఈ వివాదంపై కేసు విచారణను జనవరి 12కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
బీజేపీ లాంటి పార్టీ తెలంగాణలో జనసేనతో పని చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో అమిత్ షా వచ్చి ప్రచారం చేశారని.. బీజేపీకి క్యాడర్ లేక నేతలు లేక కాదు, జనసేనలో యువత కమిట్మెంట్ చూసి పార్టీని గుర్తించారన్నారు.