Malreddy Ranga Reddy Won From Ibrahimpatnam: తన విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నా అని కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై మల్రెడ్డి రంగారెడ్డి గెలిచారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా ప్రకటించింది. విజయం అనంతరం ఎన్టీవీతో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…
Brothers Victory: కాంగ్రెస్ తెలంగాణలో విజయదుందుభి మోగించింది. 119 అసెంబ్లీల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ హస్తం ధాటికి నిలబడలేకుండా పోయింది. తెలంగాణ ఇచ్చామన్న ట్యాగ్ ఉన్నప్పటికీ అధికారానికి తొమ్మిదిన్నర ఏళ్లు దూరంగా ఉండటం,
తమిళనాడులో భారీవర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. మరో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.. చెన్నైతో పాటు అనేక జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. తిరువల్లూర్, కంచీపురం, చెంగల్పట్టు, చెన్నై, టెంకాశీ, తూతుకుడై, తిరునెల్వెలి, కన్యాకుమారి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి,” అని ఐఎండీ ఓ ప్రకట విడుదల చేసింది. అలాగే పాటు విల్లుపురం, రాణిపేట్, కుద్దలూరు, తంజావూర్, నాగపట్టినమ్, మయియదుథురై,…
Congress Counters On Minister KTR:తెలంగాణ ఎన్నికల ఫలితాలు అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొనగా నిన్న మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్ అందులో “హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు అభిమానులు. ఆయన అదే కాదు…
BJP-Congress: 2024 లోకసభ ఎన్నికల ముందు జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా అంతా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. దాదాపుగా మూడు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది.
Coal belt: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా దూసుకుపోతోంది. 119 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 60ని దాటిన కాంగ్రెస్, స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇదిలా ఉంటే సింగరేణితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది.
Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ గత తొమ్మిదన్నర ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. నేతలు చేజారిపోవడం, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇక ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఇలా పలు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌కి ఎదురులేకుండా పోయింది.
Chennur: రాష్ట్రంలో ఎంతో ఆసక్తి రేపిన చెన్నూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న వివేక్ వెంటకస్వామి భారీ ఆధిక్యతను కనబరుస్తున్నారు. కనుచూపు మేరలో కూడా బాల్క సుమన్ కనిపించడం లేదు.
Congress: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. తెలంగాణలో 119 స్థానాలకు గానూ 60కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. అయితే ఛత్తీస్‌గఢ్ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అంటూ ఆధిక్యం చేతులు మారుతోంది. అయితే ఆ రాష్ట్రంలోని 90 స్థానాలకు గానూ కాంగ్రెస్ 50 స్థానాల్లో, బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమైంది. గతానికి భిన్నంగా ఈసారి ఓట్ల లెక్కింపలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.