తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం) జరగనుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఇక.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. కాగా.. ఓ డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు.
Read Also: Video: అమ్మకు నేనంటే ఇష్టం లేదు.. నాన్న ప్రేమగా చూడరు.. నాలుగేళ్ల చిన్నారి ఎమోషనల్
మరోవైపు.. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రత ఉండనుంది. ఇదిలా ఉంటే.. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు.
Read Also: Nagarjuna Sagar: ముగిసిన నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదం..