Assembly election results 2023: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ రోజు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే.. మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి గెలిచారు. విజయం అనంతరం హుజురాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈటెల ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఈటెలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని.. కౌశిక్‌తో ఇలాగే ఉంటదన్నారు. ‘నా గెలుపుకు కారణమైన హుజురాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు. ఈటెల రాజేందర్ ఇప్పటికైనా నోరు…
Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కౌంటింగ్‌లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.…
BJP Winning candidates in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. దాంతో హ్యాట్రిక్ కొడదామని ఆశించిన బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు కూడా గెల్వలేకపోయింది. బీజేపీ అగ్ర నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులకు చుక్కెదురైంది. దాంతో తెలంగాణలో బీజేపీ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. బీజేపీ 8 చోట్ల గెలిచింది. ఈ లిస్ట్ ఓసారి చూద్దాం. 1 నిర్మల్…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.. అయితే, కాంగ్రెస్ వేవ్‌లోనూ దాదాపు 40 స్థానాలను అధికార బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమే ప్రచారం ఉంది.
Kavitha Kalvakuntla Tweet on BRS Defeat: అధికారం ఉన్నా లేకున్నా.. తాము తెలంగాణ ప్రజల సేవకులమే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు మరియు కాంగ్రెస్ పార్టీకి ఆమె అభినందనలు తెలిపారు. దేవుడు తెలంగాణను ఆశీర్వదిస్తాడని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికి 25 స్థానాలు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టలేకపోయింది. కల్వకుంట్ల…
Kadiyam Srihari Says We will play the role of opposition: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించారని, నిండు మనసుతో ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో కేసీఆర్ నిలబెట్టారు, అయితే ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించనున్నా అని కడియం పేర్కొన్నారు. కడియం శ్రీహరి 7,819 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సిగపురం ఇందిరాపై విజయం సాధించారు.…
కాంగ్రెస్ విజయం ఖరారైన అనంతరం టీపీసీసీ చీఫ్ కీలక ప్రెస్మీట్లో మాట్లాడారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని ఆయన అన్నారు. అదే రోజున ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. . రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు..
Revanth Reddy Tweet on Kodangal Peoples: కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తనూ కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. 32,532 మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 107429 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 84897 ఓట్లు…
KTR Tweet Goes Viral: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 42 స్థానాలు గెలిచిన కాంగ్రెస్.. మరో 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 60కి కాంగ్రెస్ దగ్గరలో ఉండగా.. అధికార బీఆర్ఎస్ కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలిచి ఓటమి దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ తమ ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్…