తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మొత్తం రెడీ అయింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ కాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. ఇక, ఓట్ల లెక్కింపుకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Read Also: Telangana Elections Counting: మరికాసేపట్లో మొదలవనున్న ఎన్నికల కౌంటింగ్.. నరాలు తెగే ఉత్కంఠ
అయితే, తెలంగాణలో అతి తక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్ కేంద్రాలున్న చార్మినార్, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల ఫలితాలు తొలుత వెలువడే ఛాన్స్ ఉంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో తొలి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అత్యధిక పోలింగ్ కేంద్రాలు, ఓటర్లున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ఫలితాలు మరింత ఆలస్యం అవుతాయి. భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు కంప్లీట్ అవుతుంది.
కానీ, తెలంగాణ రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో వీటిలో ఏదో ఒక స్థానం ఫలితం తొలుత వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, చార్మినార్ నియోజక వర్గంలో తక్కువ పోలింగ్ నమోదు కావడంతో తొలుత దాని రిజల్డ్ వస్తుంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు కేంద్ర సర్వీసుల్లో ఎంప్లయిస్, దివ్యాంగులు, వయోవృద్ధులు సుమారు 2.20 లక్షల మంది వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.
Read Also: Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెర.. కాసేపట్లో కౌంటింగ్
ఇక, కాసేపట్లో ఓట్లు లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తైన తర్వాత ఉదయం 8.30 నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు స్టార్ట్ కానుంది. పది గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడి ఫలితాల వెల్లడికి అధిక సమయం పడుతుంది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహే శ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఒక్కోచోట 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో వాటిని లెక్కించడానికి చాలా సమయం పడుతుంది. అత్యధిక నియోజకవర్గాలకు 14 లెక్కింపు టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయగా ఈ ఆరు స్థానాల కోసం 28 టేబుల్స్ ను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.