Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయతీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. శనివారం శ్రమ శక్తి భవన్‌లో హైబ్రిడ్ పద్ధతిలో తెలుగు రాష్ట్రాల అధికారులతో గంటకు పైగా కేంద్ర జలవిద్యుత్ శాఖ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల తరలింపు అంశాలపై కేంద్ర జలవిద్యుత్ శాఖ అధికారులు ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏపీ, తెలంగాణ అధికారులు మినిట్స్ రూపంలో విడుదల చేస్తారని కేంద్ర జల సంఘం చైర్మన్ వెల్లడించారు.
Read also: Tirumala Tour: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే తిరుమల టూర్
అయితే.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే అసలు నీటి సమస్య మొదలైంది. కోస్తా, సీమ, తెలంగాణ మధ్య నీటి పంపకం విషయంలో సమస్య ఏర్పడింది. అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో భాగమైనప్పుడు ఆ రాష్ట్రానికి, హైదరాబాద్ కు మధ్య ఒప్పందం కుదిరింది. అదేంటంటే.. నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇప్పుడున్న స్థలానికి 17 కి.మీ ఎత్తులో నిర్మించాలని ఒప్పందం కుదిరింది.ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోస్తా ప్రాంతం తమకు మేలు చేసేలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలాన్ని ముందుకు తరలించారని తెలంగాణ ఆరోపిస్తోంది. అలాగే ఏపీకి కుడి కాల్వ, తెలంగాణకు ఎడమ కాల్వను ప్లాన్ చేశారు. కానీ ఎడమ కాలువను ఎత్తుగా నిర్మించి తమకు అన్యాయం చేశారన్నది తెలంగాణ మరో ఆరోపణ. అలాగే నల్గొండ ప్రాంతానికి నీరు తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదలను అడ్డుకుంటున్నారనేది మరో ఆరోపణ. మొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో హైలైట్ అయిన మూడు అంశాలు నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఇప్పటికీ నీటిపై గందరగోళం ఉంది.
Tirumala Tour: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే తిరుమల టూర్