భారీ మెజార్టీకి మారుపేరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత రెండుసార్లు సిద్ధిపేట నుంచి భారీ మెజార్టీతో హరీష్ రావు గెలుపొందారు. అయితే ఈసారి హరీష్ రావు వెనకపడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద నిలిచారు. వివేకానంద 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు. Also Read: Telangana Elections 2023: పీవీ నరసింహారావు రికార్డును అధిగమించిన శ్రీధర్ బాబు! కుత్బుల్లాపూర్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంథని నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా.. 1,95,632 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు 1,01,796 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు 71,732 ఓట్లు వచ్చాయి.…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో బీజేపీని గెలిలించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం పెద్ద విజయమని అన్నారు. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణం అని కిషన్ రెడ్డి పేరొన్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించడంతో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు కిషన్ రెడ్డి కామారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన…
తెలంగాణ గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ.. గవర్నర్‌కు లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా ముఖ్య నేతలు మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ…
తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఈ రోజు మధ్యాహ్నం సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో అంజనీ స్థానంలో రవిగుప్తాను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీ కుమార్‌తో పాటు ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌కుమార్ జైన్, మహేశ్ భగవత్‌కు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. డీజీపీ అంజనీ కుమార్‌ను ఈ రోజు మధ్యాహ్నం ఈసీ చేసింది.…
Young Candidates Won in Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 సీట్లు (మ్యాజిక్ ఫిగర్ 60) కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం 7 సీట్లలో…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై 17,158 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాంతో ఇక్కడ ‘శవయాత్ర’ తప్పింది. ప్రచారంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓడిపోతే హుజారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ తన శవయాత్రకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం చివరి రోజున పాడి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీ (బీజేపీ) ఖాతా తెరవలేదు. పోటి చేసిన ఇద్దరు ఎంపీలు పరాజయం పాలయ్యారు. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సైతం ఓటమి చెందారు. దాంతో మూడు చోట్ల రెండవ స్థానంతో కమల నాథులు సరిపెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి బరిలోకి దిగిన ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాడి ఓడారు. వరుసగా మూడు సార్లు గంగుల చేతిలో ఓడిపోవడం విశేషం. కోరుట్ల నుంచి…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ ఆశలు ఆవిరైపోయాయి.