Congress: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. తెలంగాణలో 119 స్థానాలకు గానూ 60కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. అయితే ఛత్తీస్‌గఢ్ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అంటూ ఆధిక్యం చేతులు మారుతోంది. అయితే ఆ రాష్ట్రంలోని 90 స్థానాలకు గానూ కాంగ్రెస్ 50 స్థానాల్లో, బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.
Read Also: Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..
ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి సమావేశానికి పిలుపునిచ్చారు. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ ఆధిక్యతను కనబరుస్తోంది.