Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఉలికిపాటు..! కౌంటర్స్, రివర్స్ కౌంటర్స్ సంగతేంటి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఎగ్జాక్ట్‌గా వచ్చాయి. దశాబ్దకాలం తర్వాత అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ కేడర్ యమా జోష్ మీదుంది. అదే సమయంలో… వాళ్ళతో సమానంగా, ఇంకా చెప్పాలంటే…కొంచెం ఎక్కువ సమానంగా ఉత్సాహ పడుతోందట ఏపీ టీడీపీ కేడర్. గెలిచింది కాంగ్రెస్సే అయినా… అందులో తమను చూసుకుంటూ మురిసిపోతున్నారట ఎక్కువ మంది టీడీపీ లీడర్స్, కేడర్. రకరకాల విశ్లేషణలు, చర్చలతో వ్యవహారాన్ని రక్తి కట్టిస్తున్నారట. ప్రత్యేకంగా ఎలాంటి మాటలు జరక్కుండానే… కొన్ని చోట్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ జెండాలు కూడా కనిపించడం, ఇప్పుడు అదే పార్టీ అధికారం చేపట్టబోతుండటాన్ని పాజిటివ్ సైన్‌గా భావిస్తున్నారట టీడీపీ కార్యకర్తలు.
అలాగే.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ అన్న మాటలు, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటూ… అడిగిన వాళ్ళు, అడగని వాళ్ళ దగ్గర చర్చలు పెట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరు కిందిస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మీద భారీగా బెట్టింగ్‌లు కాసినట్టు తెలిసింది. ఇప్పుడు వాళ్ళంతా ఖుషీ ఖుషీగా ఉన్నారట. పార్టీ అధ్యక్షుడు సైలెంట్‌గా ఉన్నా.. నాయకుల్లో మాత్రం కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయంటున్నారు. ఏపీలో కూడా సీన్ మారిపోతుందన్నంత బిల్డప్ ఇస్తున్న టీడీపీ నేతల ఉత్సాహాన్ని చూస్తున్న వైసీపీ లీడర్స్ మాత్రం.. అంతొద్దమ్మా.. కాస్త తగ్గాలమ్మా అని సలహాలిస్తున్నారట. అక్కడి రాజకీయాలు వేరు, ఇక్కడి రాజకీయాలు వేరు.. కాస్త లోతుల్లోకి వెళితే.. టీడీపీకే డ్యామేజ్ అయింది. ముందు ఆ సంగతేంటో చూసుతోండని అంటున్నట్టు తెలిసింది.
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పక్షాన నిలిచింది కోర్ తెలంగాణ మాత్రమే. గ్రామీణ ప్రాంతాలను వదిలేసి జీహెచ్‌ఎంసీ పరిధిలో సీమాంధ్ర ఓటర్లు, అందునా మీరు గొప్పగా చెప్పుకుంటున్న ఐటీ ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారట. గట్టిగా మాట్లాడుకుంటే… బీఆర్‌ఎస్‌కు వచ్చినవాటిలో ఎక్కువ సీట్లు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలోనే ఉన్నాయని, దాన్ని బట్టి చూస్తే… మీరు అనుకుంటున్న వర్గాలన్నీ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్టు అర్ధమవుతోందని, అలాంటప్పుడు కాంగ్రెస్ గెలుపు సంబరాలతో మీకేం పని అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ మిత్రపక్షం జనసేన పరిస్థితిని కూడా చెబుతూ… వాస్తవానికి, తెలుగుదేశం నేతలు ప్రచారం చేసుకుంటున్నదానికి పొంతన లేదని విశ్లేషిస్తోంది వైసీపీ. ఫలితాలను బట్టి చూస్తుంటే… టీడీపీ గొప్పగా చెప్పుకుంటున్న వర్గాలన్నీ బీఆర్‌ఎస్‌వైపే ఉన్నట్టు అర్ధమవుతోందని, అలాంటప్పుడు కాంగ్రెస్ గెలుపునకు వీళ్ళు సంబరాలు చేసుకోవడంలో అర్ధం ఏముందని అడుగుతున్నారట వైసీపీ నాయకులు.
టీడీపీలోని మరో వర్గం వాదన సైతం డిఫరెంట్‌గానే ఉందంటున్నారు. ఆ ఫలితాలు కేడర్‌లో ఉత్సాహం నింపడానికి పనికొస్తాయి తప్ప… వాస్తవంగా లెక్కలు చూసుకుంటే తేడా కొడుతోందన్నది ఆ వర్గం అభిప్రాయంగా తెలిసింది. పార్టీ మీద,చంద్రబాబు మీద అంత సానుకూలతే ఉంటే… అరెస్ట్ సమయంలో సోషల్ మీడియా పోస్టింగ్స్‌తో ఓ రేంజ్‌లో హంగామా చేసినవాళ్ళు, ర్యాలీలు తీసిన వాళ్ళందరి ఓట్లు ఎక్కడికి పోయాయని అడుగుతోందట టీడీపీలోని ఆ వర్గం. అలాగే మిత్రపక్షం జనసేన 8సీట్లలో పోటీ చేస్తే…ఏడు చోట్ల డిపాజిట్స్ రాకపోవడాన్ని ఎలా చూడాలన్నది కూడా ఆ వర్గం ప్రశ్నగా తెలిసింది. దాని మీద లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నది ఆ వాదనను సమర్ధించేవారి అభిప్రాయంగా తెలిసింది. అయితే… ఖమ్మం సహా చాలాచోట్ల సెటిలర్స్ ఉన్నారని, వాళ్ళందరి ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయికదా… కేవలం అర్బన్‌ని ప్రామాణికంగా తీసుకుని ఎలా నిర్ణయానికి వస్తారన్న మరో వాదన ఉంది. ఇలా… వైసీపీ, టీడీపీ మధ్య తెలంగాణ ఫలితాలపై రకరకాల వాదనలు, విశ్లేషణలు, చర్చలు నడుస్తున్నాయి. అవి అక్కడితో ఆగుతాయా లేక చర్చలు రచ్చగా మారతాయా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ గెలుపును ఎవరికి వారు నచ్చినట్టు అన్వయించుకుంటూ ఆనందపడుతున్నారు.
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..