తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తారీఖు నుంచి రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు, బీఆర్ఎస్ 39 స్థానాలు, బీజేపీ 8 సీట్లు, మజ్లిస్ పార్టీ 7 సీట్లు, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుంది. ఇక, ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేపటికి వాయిదా వేసింది. ఇక, ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు నలుగురు పరిశీకులు అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తెలంగాణలో ఎన్నికల కోడ్ ను ఎత్తివేసింది.
Read Also: Money Earning: ఆవులు, గేదెలకు బదులు గాడిదల పెంపకం.. ప్రతినెలా రూ.3 లక్షల వరకు సంపాదన..!
ఇక, మరో వైపు తెలంగాణ రెండో శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. మంత్రి వర్గ సిఫార్స్ మేరకు సెకండ్ అసెంబ్లీని క్యాన్సిల్ చేశారు. కొత్త ప్రభుత్వానికి సంబంధించి సాంకేతికపరమైన ఏర్పాట్లు కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతుంది.