Telangana CM Post: సీఎం ఎవరనేదానిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM Post: సీఎం ఎవరనేదానిపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఆయన వెల్లడిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, నిన్న సమావేశమైన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఖరారు అయ్యే వరకు వారంతా అక్కడే ఉండనున్నారు.
Read also: Health Tips: ఉదయం లేవగానే నీళ్లు తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
తెలంగాణలో న్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక వాయిదా పడింది. ముఖ్యమంత్రి పదవి ఎవరికివ్వాలనే గొడవ ఈజీగా తేలేలా కనిపించడం లేదు.. సీఎం ఎంపిక కోసం సోమవారం హైదరాబాద్‌లో జరగిన ప్రయత్నాలేవీ సక్సెస్ కాలేదు.. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించే బాధ్యతను అధిష్టానానికి ఇచ్చారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి వెళ్లింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ ఫస్ట్ కి వచ్చింది.
ఎమ్మెల్యేల మీటింగ్ నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టు వీడడం లేదు.. తామూ సీఎం పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హై కమాండ్‌కు మొర పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. దీంతో రేసులో ఉన్నవారందరి పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుంది అనుకుని ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాటు కూడా చేశారు.. అయితే, సీఎం అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో రాజ్‌భవన్ నుంచి పోలీసులు వెళ్లిపోయారు.
Tuesday : ఆంజనేయుడి ఫోటోలను ఇంట్లో పెడుతున్నారా? ఈ విషయాలను తెలుసుకోవాలి..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!