తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు రాలేదు, అసలు డిపాజిట్ కూడా రాలేదు అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం వైఎస్ జగన్.
MLC Jeevan Reddy Slams KTR: కేటీఆర్.. నువ్ ఏం భయపడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని కేటీఆర్ పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మీదేనని, రాష్ట్రన్ని నిండా అప్పులో ముంచారని, రాష్ట్ర సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని జీవన్…
Congress Kisan Cell Leader Kodanda Reddy Heap Praise on CM Revath Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేసారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని కోదండ…
Adilabad Rims: ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రి వద్ద అర్థరాత్రి సందడి నెలకొంది. ఆస్పత్రిలోకి చొరబడిన దుండగులు వైద్య విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. తాము రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ అభిమానులమని దుండగులు చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లకు సంబంధించి గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అందులో ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదైంది.. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయ్యాయి.