Congress Kisan Cell Leader Kodanda Reddy Heap Praise on CM Revath Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేసారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని కోదండ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన ఉందని చెప్పారు.
‘తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్ర నేతలు ప్రజల వద్దకు వెళ్లి విశ్వాసం కలిగించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుంది. 2017 అక్టోబరులో కేంద్రం, రాష్ట్రం కలిసి ముచ్చర్ల ఫార్మాసిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమి సేకరణ కోసం పని చేసింది. ప్రజాభిప్రాయ సేకరణలో 19,330 భూమి కావాలని అడిగినప్పుడు ప్రజలు వ్యతిరేకం చెప్పారు. ప్రభుత్వం వేల మంది పోలీసులు పెట్టి ప్రజలను అడ్డుకున్నారు’ అని కోదండ రెడ్డి అన్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. కార్ల కలర్ మార్చాలని ఆదేశం
‘పేదలకు ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా గత ప్రభుత్వం లాక్కుంది. ప్రజలకు వ్యతిరేకంగా పాలక పక్షాలు పనిచేసాయి. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కూడా ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. నిన్న సీఎం ఫార్మాసిటీ రద్దు చేసి అక్కడ నుంచి తరలిస్తామని చెప్పారు. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజక వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు’ అని కోదండ రెడ్డి చెప్పుకొచ్చారు.