Pawan Kalyan and Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అయితే, జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు గాను కూకట్‌పల్లిలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తప్పితే.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది.. చెప్పుకోదగిన ఓట్లు కూడా సాధించలేకపోయింది.. ఇదే, సమయంలో.. చివరి నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్ బరెలక్క 5 వేలకు పైగా ఓట్లు సాధించారు.. దీంతో.. అప్పటి నుంచి పవన్ కల్యాణ్.. ప్రత్యర్థులకు టార్గెట్‌గా మారిపోయాడు.. పవన్ కంటే బర్రెలక్క బెటర్ అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్ చేయగా.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బర్రెలక్క, పవన్ కల్యాణ్ పేర్లను ప్రస్తావించారు.
Read Also: CM YS Jagan: కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి దేశానికే ఆదర్శం కావాలి.. నాడు ఎందుకు పట్టించుకోలేదు..
మాట ఇస్తే మాట మీద నిలబెట్టుకునే చరిత్రలేదు చంద్రబాబుకు అంటూ ఫైర్ అయ్యారు సీఎం జగన్.. ఎన్నికలు వచ్చేసరికి తన ఆధారపడేది.. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయక్తులే అంటూ ఆరోపించారు.. ఒక దత్తపుత్రుడుని పెట్టుకొని డ్రామాలు కూడా ఆడతారు.. ఈ దత్తపుత్రుడు తెలంగాణాలో పుట్టనందుకు బాధపడతానని తెలంగాణలో మాట్లాడతాడు.. నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ప్యాకేజీ స్టార్ చాలా డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు.. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు రాలేదు, అసలు డిపాజిట్ కూడా రాలేదు అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Raja Singh: పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా.. మనసులో మాట బయటపెట్టిన రాజాసింగ్
ఇక, విశాఖ పరిపాలన రాజధాని పెడదామంటే ప్రతిపక్ష నేతలు అడ్టుకుంటున్నారు. ఈ ఉత్తరాంధ్రలో పోర్ట్, ఎయిర్‌పోర్ట్ వస్తాదంటే ఏడుస్తారు అని మండిపడ్డారు సీఎం జగన్.. ఇక్కడ నివాసం ఉంటానంటే ఏడుస్తారు. వేరే రాష్ట్రంలో నివాసం ఉంటూ , ఓ దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాన్ లోకల్స్ ఏం చేయాలో మనకు చెబుతారు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు మనం చేయాలా..? అని ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాయాలు తీసుకువచ్చి, వాలంటీర్లను ఏర్పాటు చేస్తే ఏడుపే నంటూ విపక్షాలపై ఫైర్ అయ్యారు సీఎం వైఎస్ జగన్.