KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఇవాల ఉదయం 11 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని తన ఇంటికి పయనం అయ్యారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ యశోద వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారు.
Praja Bhavan: ప్రజా వాణి కి భారీగా జనం క్యూ కట్టారు. మంగళ..శుక్రవారంలో ప్రజావాణి నిర్వహించాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా ప్రజలకు తరలివస్తున్నారు.
తెలంగాణలో కొలువై ఉన్న మహిమాన్విత దేవుడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు.. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలుచేసిన అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.. గురు,శుక్రవారాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.. అంతేకాదు భక్తుల రద్దీతో స్వామివారి ఆదాయం రూ. 46,65,974 సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు.. తాజాగా ఈ రెండు రోజుల్లో పెరిగిన ఆదాయం వివరాలను ఆలయ అధికారులు తెలిపారు.. ఆ…
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు శీతల గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గడం లేదు. దీంతో చలిమంటలను జనం ఆశ్రయిస్తున్నారు. స్వెట్టర్లు, రగ్గులు కప్పుకున్నా.. చలి మాత్రం వాయించేస్తోంది. దీంతో ఇదెక్కడి చలిరా బాబు అంటూ జనం గజగజా వణుకుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పల్లెవెలుగు, ఎక్సెప్రెస్ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో 182 మంది మహిళలతో వెళ్తున్న రూరల్ బస్సు టైర్ల నుంచి పొగలు రావడంతో ఆగిపోయింది.
మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.