MLC Jeevan Reddy Slams KTR: కేటీఆర్.. నువ్ ఏం భయపడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని కేటీఆర్ పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మీదేనని, రాష్ట్రన్ని నిండా అప్పులో ముంచారని, రాష్ట్ర సమాజాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. నేడు జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో ఫిల్టర్ బెడ్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు.
జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘కేటీఆర్‌కి ఉన్న అవగాహన ఏమిటో ఓసారి తెలుసుకోవాలి. కేటీఆర్.. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలని నెమరువేసుకో. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని కేటీఆర్ అనడం సరికాదు. కేటీఆర్.. ప్రభుత్వం మంచి కోరుకో, రాష్ట్ర ప్రభుత్వనికి సహకరించు. నువ్ ఏం భయపడాల్సిన అవసరం. మాకు గతంలో ప్రభుత్వన్ని నడిపిన అనుభవం ఉంది’ అని కౌంటర్ వేశారు.
Also Read: Kodanda Reddy: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేస్తుంది: కోదండ రెడ్డి
‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత మీదే. రాష్ట్రన్ని నిండా అప్పులో ముంచారు. ఆదాయం సమాకుర్చుకోవడనికి తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసను చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం నుంచి విముక్తి కలిపిస్తాం. బెల్ట్ షాప్ లను ఎత్తేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ప్రజలకు మంచి పాలన అందిస్తాం’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.