‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న సినిమా ‘కింగ్’ వహిస్తున్నారు. షారుక్ – సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డంకి ప్లాప్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టేందుకు మరోసారి సిద్దార్ధ్ ఆనంద్ తో చేతులు కలిపాడు షారుక్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో షారుక్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటిస్తుండడం విశేషం.
Also Read : Telugu Actor : ఒక్క హిట్ కోసం ఐదేళ్లుగా వెయిట్ చేస్తుస్తున్నస్టార్ హీరో
కింగ్ సినిమాను ఏకంగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కిస్తున్నాడు సిద్దార్ధ్ ఆనంద్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. విడుదల తేదీ ప్రకటనతో పాటు ఒక పవర్‌ఫుల్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా షేర్ చేశారుమేకర్స్. కాగా ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ నుండి టెక్నిషియన్స్ ను రప్పించి మరి షూట్ చేస్తున్నారు. షారుక్ – సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన పఠాన్ బాలీవుడ్ హిస్టరీ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి.