Telangana Weather: తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా చలిగాలులు వీచాయి. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం. కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ…
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్ కో రాత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వచ్చింది. ఈ పరీక్ష ఈనెల 17న జరగాల్సి ఉంది.. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు జెన్ కో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని.. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కే సింగ్ వెల్లడించారు.
Minister Ponnam Prabhakar Visits Husnabad Govt Hospital: ఏ సమస్యలు ఉన్నా మధ్యవర్థుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా తనను కలవవచ్చు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తా అని హామీ ఇచ్చారు. హుస్నాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోందని, కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి…
Tata Ace Fire Incident in Jangaon District: జనగామ జిల్లాలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. చిల్పూర్ మండలం వంగాలపల్లి వద్ద మంగళవారం ఉదయం ఓ టాటా ఏస్ వాహనం దగ్దం అయింది. మంటలు గమనించిన ప్రయాణికులు హుటాహుటిన వాహనం నుంచి కిందికి దిగిపోయారు. దాంతో వారు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. టాటా ఏస్ వాహనం రన్నింగ్ లో ఉండగానే మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికీ గాయాలు కాలేదు. షాట్ సర్క్యూట్…