ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా చౌక్ ని ఆయన పరిశీలించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఇంచార్జులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీలో వ్యక్తి కేంద్రీకృతంగా పోస్టులు పెడితే వేటు తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై తీసుకుంటున్న విషయాలను గురించి ఆరా తీసిన మంత్రి..
తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు రిమ్స్ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపేందుకు అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందగా.. సీసీకి గాయాలయ్యాయి. గన్‌మెన్‌కి కూడా గాయాలు…