తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ లను బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్ లు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. డీజీపీగా రవిగుప్తాను కొనసాగించింది. రోడ్‌సేఫ్టీ డీజీగా అంజనీకుమార్.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. రైల్వే డీజీగా మహేష్ భగవత్.. సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్.. జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా.. ఎస్ఐబీ చీఫ్‌గా సుమతి.. సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు.. సెంట్రల్‌జోన్ డీసీపీగా శరత్చంద్ర.. కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించింది.
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కేశవాపురం గ్రామంలో భూకబ్జా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Ponnam Prabhakar: ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం ముగిసింది. ప్రజావాణి కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రెండు వైపులా భారీ క్యూ లైన్ బారులు తీరారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సీఎం భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా…
ఎక్కడైనా దొంగలు దొంగతనానికి వస్తే దొరికినకాడికి దోచుకుపోతారు.. కానీ ఇటీవల కొన్ని దొంగతనాలు మాత్రం జనాలను పొట్ట చెక్కలయ్యేలా చేస్తున్నాయి.. ఈ మధ్య దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఏదోక చిన్న పని చేసి అడ్డంగా దొరికిపోతున్న ఘటనలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణాలో వెలుగు చూసింది.. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రలోకి జారుకున్నాడు.. ఇక ఏముంది అక్కడ వాళ్లకు దొరికాడు.. ఈ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. కామారెడ్డి…
Covid JN.1: కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా యొక్క వేరియంట్ మళ్లీ వ్యాపిస్తోంది. ఇప్పటికే చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 38 దేశాల్లో విస్తరిస్తున్న కరోనా జేఎన్.1 కొత్త వేరియంట్ భారత్‌లోనూ కలకలం రేపుతోంది.
హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలనపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే వరుస దాడులు కొనసాగుతుండటంతో పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, టీఎస్ఎన్ఏబీ, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో నాలుగు డ్రగ్స్ గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశారు.