Covid JN.1: కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా యొక్క వేరియంట్ మళ్లీ వ్యాపిస్తోంది. ఇప్పటికే చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 38 దేశాల్లో విస్తరిస్తున్న కరోనా జేఎన్.1 కొత్త వేరియంట్ భారత్‌లోనూ కలకలం రేపుతోంది. కరోనా యొక్క ఈ కొత్త వేరియంట్ కేసు ఇప్పటికే కేరళలో బయటపడింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త కరోనా వేరియంట్ హెచ్చరికపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. గతంలో కరోనా రోగులకు సేవలు అందించిన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. కరోనా జెఎన్.1 వేరియంట్ సోకిన వారికి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గాంధీ వైద్యులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 50 పడకలను సిద్ధం చేసినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.
Read also: Devara: మళ్లీ నెగటివ్ ట్రెండ్… ఈసారి డైరెక్ట్ గా ఎన్టీఆర్ రంగంలోకి దిగాలేమో
ఈ వైరస్ సోకితే జ్వరం, ముక్కు కారటం, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ JN.1 వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజర్‌తో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వాడాలని… సామాజిక దూరం పాటించాలని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ కరోనాతో ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Pindam Movie Success Meet: ‘పిండం’ సినిమా సక్సెస్ మీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..