నేడు తెలంగాణ పర్యటనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు చోట్ల ఇవాళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18(రేపు) రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.
శబరిమలకు అయ్యప్ప దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకోకుండానే.. మధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యవాఖ, అటవీశాఖ, రోడ్లుభవనాల, రవాణాశాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు. విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను నియమించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు మమ్ములను ప్రశ్నలు అడిగారు.. ప్రత్యర్థులు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయని తెలిపారు. వారి విమర్శలను తిప్పికొట్టడంలో నిర్లిప్తత చేయడంతో నష్టం చేకూరిందని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్పజెప్పాం అనే దానిపై బండి…