Tollywood Box Office: 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాల పంట బాగానే పండింది. బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలన్నీ అదృష్టాన్ని అందిపుచ్చుకుని థియేటర్లలో నిలదొక్కుకున్నాయి. ముఖ్యంగా రాబోయే 20 రోజులకు పైగా పెద్ద సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో సంక్రాంతి విన్నర్స్ వైపే బాక్సాఫీస్ మొత్తం దృష్టి వెళ్లింది. వీక్ డేస్‌లో కలెక్షన్లు ఎలా ఉన్నా, వీకెండ్ వస్తే మాత్రం థియేటర్లలో మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తోంది.
సంక్రాంతి రేస్‌లో ఐదు సినిమాలు బరిలోకి దిగగా.. అందులో రెండు సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజాసాబ్’కు భారీగా బిజినెస్ జరిగినప్పటికీ, ఇప్పటివరకు కొద్దిపాటి కల్లక్షన్స్ కే పరిమితమైంది. అలాగే మడ్ద మహారాజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా కొంత వరకే వసూళ్లు సాధించింది.
Mokshagna Debut: ప్రాజెక్టులు క్యాన్సిల్… డైరెక్టర్లు మార్పు.. నందమూరి వారసుడి ఎంట్రీ ఎప్పుడో మరి..?
ఇక మరోవైపు చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మాత్రం సంక్రాంతి హాలిడేస్‌లోనే కాదు.. ఆ తర్వాత వచ్చిన మండే టెస్ట్‌ను కూడా విజయవంతంగా దాటేశాయి. ఇప్పటికీ వీక్ డేస్‌లో మంచి వసూళ్లు రాబడుతూ వీకెండ్లలో హౌస్‌ఫుల్స్‌కు చేరుకునే స్థాయిలో ఉన్నాయి.
‘మన శంకర వరప్రసాద్ గారు’ను 120 కోట్లకు బిజినెస్ చేయగా.. ఇప్పటికే 150 కోట్ల షేర్‌ను దాటింది. గ్రాస్ పరంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. 137 కోట్ల ‘వాల్తేరు వీరయ్య’ రికార్డును దాటేసిన ఈ సినిమా, 160 కోట్ల షేర్ చేసిన ‘అల వైకుంఠపురంలో’ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో రావాల్సిన ఏకైక క్రేజీ మూవీ ‘స్వయంభు’ కూడా పోస్ట్‌పోన్ కావడం సంక్రాంతి హిట్స్‌కు మరింత కలిసివచ్చింది. ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమా VFX పనులు ఆలస్యం కావడంతో ఏప్రిల్ 10కి వాయిదా పడింది. దీంతో చిన్న సినిమాలు తప్ప యంగ్ హీరోల సినిమాలు కూడా రిలీజ్‌కు నోచుకోవడం లేదు.
Gen Z: కార్పొరేట్ ఇండియాకు యువత మాస్ వార్నింగ్.. 23వేల మంది చెప్పిన నమ్మలేని నిజం!
ఈ మధ్యలో రాబోయే చిన్న చిత్రాలు వచ్చినా అవి సంక్రాంతి హిట్స్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఫిబ్రవరి 13న విశ్వక్‌సేన్ ‘ఫంకీ’ రిలీజ్ అనౌన్స్ అయినప్పటికీ.. ఇప్పటికి ప్రమోషన్లు మొదలుకాకపోవడంతో ఆ సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ కూడా నెలకొంది. మార్చి 19 వరకు పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడంతో అప్పటివరకు సంక్రాంతి సినిమాలకే లాంగ్ రన్ దక్కుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా.