BJP Vijaya Sankalpa Yatra: రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే నేటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. నారాయణపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణ పేట జిల్లా కృష్ణా నదిలో పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా గ్రామంలో విజయసంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మాగునూరు మండలం మీదుగా మక్తల్ పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఊట్కూరు మండలంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సింగారం గేటు మీదుగా రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Read also: Assam CM to Basara: నేడు బాసరలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్న అస్సోం సీఎం
ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితర పార్టీల సీనియర్ నేతలు పాల్గొంటారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పదేళ్లలో సాధించిన విజయాలు, విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. బస్సుయాత్రల్లో భాగంగా నిర్వహించే కార్నర్ మీటింగ్ లకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ పార్టీల నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ వద్ద కుమురం భీమ్ క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా సాగి నిజామాబాద్ జిల్లా బోదన్‌లో ముగుస్తుంది.
Read also: Mobile Phones Ban: ప్రధాని కీలక నిర్ణయం.. తరగతి గదుల్లోకి మొబైల్స్ ఫోన్స్ నిషేధం!
వికారాబాద్ జిల్లా తాండూరులో రాజేశ్వరి క్లస్టర్‌ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగి కరీంనగర్‌లో ముగుస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్ర భువనగిరి నుంచి ప్రారంభమై మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి హైదరాబాద్‌లో ముగుస్తుంది. భద్రాచలం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ-భద్రకాళి క్లస్టర్ బస్సు యాత్ర మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాలను కవర్ చేసి ములుగు జిల్లాలో ముగుస్తుంది. కృష్ణా నది మఖ్తల్ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో సాగి నల్గొండలో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Global Top100 : ప్రపంచంలోని టాప్ 100 లగ్జరీ వస్తువుల తయారీదారులలో మలబార్ గోల్డ్, టైటాన్