ఈనెల 11 నుండి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11న(రేపు) స్వస్తి వచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పాల్గొననున్నారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
నేడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు.
తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు. Also Read: Ramanthapur SBI: రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం.. కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ మేనేజర్లు! శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్…
హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.2.80 కోట్లు కాజేశారు. ఖాతాదారులకు తెలియకుండా.. వారి డాక్యుమెంట్లు తీసుకుని మేనేజర్లు ఘరానా మోసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో షేక్ సైదులు, గంగ మల్లయ్యలు రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో బ్యాంక్ మేనేజర్లుగా పని చేశారు.…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు అని మాజీ మంత్రి పుష్ప లీల విమర్శించారు. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకి లేదని, కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశించటానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకి లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది? అని పుష్ప లీల ప్రశ్నించారు.…