నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీఈసీ మీటింగ్ కు హాజరు.. తెలంగాణలో మిగిలిన అభ్యర్థులపై చర్చ.. నేడు ఖమ్మం, కోదాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నేడు చిలకలూరుపేటలో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి సభ ఏర్పాట్లకు భూమిపూజ.. పాల్గొననున్న మూడు పార్టీల నేతలు.. నేడు…
ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి.
Indiramma Houses: తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
బీజేపీ రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధం అయింది. అందుకోసం.. సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, గుజరాత్లతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే 195 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. మరో 150 మందిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన 8 స్థానాలపై…
తిరుమలలో కిడ్నాప్ కు గురైన మూడేళ్ల చిన్నారి ఘటన సుఖాంతమైంది. ఈరోజు మధ్యాహ్నం ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించింది. యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద చిన్నారిని ఎత్తుకెళ్లింది. దీంతో హుటాహుటిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సాయంత్రం 5 గంటల…