Ragging: పిల్లలపై ర్యాగింగ్ భూతం.. ఆరో తరగతి విద్యార్థులను చితకబాదిన సీనియర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragging: ఇప్పటివరకూ కళాశాల స్థాయిలోనే వినిపించే మాట ఇది. ఇప్పుడది పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. 6,7వ తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య ర్యాగింగ్ నేపథ్యంలో ఘర్షణ చెలరేగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెప్పిన పని వినలేదని ఆరవ తరగతి విద్యార్థులను సీనియర్లు చితకబాదారు. ఆరో తరగతికి చెందిన నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మొహంపై గాయాలు, తీవ్ర జ్వరంతో విద్యార్థులు బాధపడుతున్నా అధికారులు తల్లిదండ్రులకు సమాచారమివ్వలేదు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. నిన్న సెలవు కావటంతో చూసేందుకు తల్లిదండ్రులు వెళ్లగా.. ముఖంపై గాయాలు కావడంతో ర్యాగింగ్ వ్యవహారం బయటపడింది. విద్యార్థుల ముఖంపై గాయాలు చూసిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పేరెంట్స్‌కు ఎందుకు చెప్పలేదని అధికారులపై మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: Kishan Reddy: మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం బాగుంటుంది
Also Read
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
‘ర్యాగింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం’..అంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ర్యాగింగ్ భూతం ఇంకా వీడలేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యాలు కఠినంగా ఉండడంతో కొంతవరకూ తగ్గుముఖం పట్టినా.. ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగృహాల్లో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాటిపై పర్యవేక్షణ కొరవడడమే ర్యాగింగ్ రుగ్మత పెరగడానికి కారణమని తేటతెల్లమవుతోంది.
తాజావార్తలు
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!