హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కుమారుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
దేశంలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీని దేశ ప్రజలు నరేంద్రమోడీకి కట్టబెట్టపోతున్నారు.. దేశంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం.. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం నరేంద్రమోడీ నాయకత్వంలో నీతివంతమైన ప్రభుత్వం మళ్లీ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు.
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాసేపట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నేతీ చెందంలాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారు