Ponnam Prabhakar: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ రాముని ఫోటోలు పెట్టి రాజకీయం చేయడం సరికాదని.. బండి సంజయ్ ఎన్ని ఆలయాలను అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.
Read Also: Kishan Reddy: మూడో సారి మళ్లీ మోడీనే ప్రధాని కాబోతున్నారు..
రాముడు అందరికీ దేవుడు.. మేం కూడా శ్రీరామనవమి రోజు పూజలు చేస్తామన్నారు. కేసీఆర్ హిందూ గాళ్ళు బొందు గాళ్లు.. అన్న పదంతో, నినాదంతో గెలిచిన బండి సంజయ్ ఆలయాలకు నువ్వు ఏమి అభివృద్ధి చేశావో చెప్పాలన్నారు. ఎన్నికలు రాగానే మాయగాళ్ళు అందరూ వస్తారని.. ప్రజలు మోసపోవద్దన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఇక్కడే ఏమీ లేదని.. నీ దగ్గర ప్రాంతంలో ఏమైనా ఓట్లు అడుక్కోవాలని అన్నారు. త్వరలో బండి సంజయ్ అవినీతిని బయట పెడతామని ఆయన పేర్కొన్నారు. అవినీతి చేసినందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. కొండగట్టు ఆంజనేయస్వామి విగ్రహం కట్టిస్తా అని మాట తప్పిన కవితక్క జైలుకు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రాక్షస పాలన పోయి కాంగ్రెస్ పాలన రావాలని ఎన్నికల ముందు ముడుపు కట్టి ఈ రోజు ముడుపు చెల్లించుకున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఏడాది గురు బలం కేసీఆర్ కన్నా సీఎం రేవంత్‌కు, తనకే ఎక్కువగా ఉందన్నారు.