Harish Rao: ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది: హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Campaign in Medak: 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని, ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉందని, ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని, ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి రుద్రారంలోని సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ఈరోజు హరీష్ రావు ప్రారంభించారు.
సంగారెడ్డిలో లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ‘కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డి డ్రాయర్ ఉడదీస్తా అంటాడు. నువ్వు సీఎంవా? లేదా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా? రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు నోసిటితో వెక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉంది. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయింది’ అని అన్నారు.
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
Also Read: MI vs RCB: ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అతడే మా కొంపముంచాడు: డుప్లెసిస్
‘కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసింది. ఇక ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తం లాగా తయారయ్యింది. 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఈ సారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది’ అని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మెదక్ లోక్‌సభ నుంచి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?