పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు.
దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని ఆయన వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు కందగట్ల అనిల్-దేవి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.