Leopard at Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని సమాచారం. దీంతో విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. అలాగే చిరుత సంచార వార్త తెలిసి విమానాశ్రయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
Read also: V. Hanumantha Rao: కాంగ్రెస్ కులగణన చేస్తామంటే.. మోడీకి భయం పట్టుకుంది..
ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు. దాదాపు మూడేళ్ల క్రితం చిరుతపులి విమానాశ్రయం గోడపై నుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. వీడియోలో, చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కొండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది.
Lok Sabha Election : ఎన్నికల డ్యూటీకి వెళ్తున్న భద్రతా దళాల బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఇద్దరు మృతి, 12మందికి గాయాలు