Konda Vishweshwar Reddy: రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. యూపీలో బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి భయపడే రాహల్ గాంధీ వాయనాడ్ కు పారిపోయారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముస్లిం, మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయన్న కారణంగానే రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కూడా తన వెంట నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ పాలనలో నరేంద్ర మోడీ సర్కారు మాత్రమే ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిందని ఆయన గుర్తు చేశారు.
Read Also: KTR: 12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుంది..
రాష్ట్రంలోనూ బీజేపీదే హవా..
తెలంగాణ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 12 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను సాధించబోతున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరి హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని.. కానీ సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవని ఆయన స్పష్టం చేశారు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్, బుద్వేల్, రాజేంద్రనగర్, శివరాంపల్లి, రాఘవేంద్రనగర్, ఆరాంఘర్, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ మల్లారెడ్డి పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.