XI Jinping Coup: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరిగిందనే వార్తలు వినిస్తున్నాయి. జిన్‌పింగ్‌ను అరెస్ట్ చేయాలిన సైనిక అధికారులు ప్రణాళిక వేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయం ఆపరేషన్‌కు కొన్ని గంటల ముందే జిన్‌పింగ్‌కు తెలిసిందని, దీంతోనే ఈ తిరుగుబాటు విఫలమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్(CMC) వైస్ చైర్మన్ జాంగ్ యౌషియా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ లియు జెన్లీలపై జిన్‌పింగ్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెస్ట్రన్ మీడియా కోడైకూస్తోంది. ఇప్పటికే చైనా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం జాంగ్, లియులు తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘటనకు పాల్పడినట్లు ప్రకటించింది.
దీనికి తోడు చైనీస్ మిలిటరీ అధికారిక వార్తాపత్రిక పీఎల్ఏ డైలీలో అధివారం ప్రచురితమైన ఎడిటోరియల్ ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇద్దరు జనరల్స్ “ఛైర్మన్ బాధ్యత వ్యవస్థను తీవ్రంగా తొక్కి, దెబ్బతీశారని” ఆరోపించింది. ఇక్కడ ఛైర్మన్ అంటే షి జిన్‌పింగ్. ఆయన తర్వాత స్థానంలో జాంగ్ యూక్సియా ఉన్నారు.
Read Also: Ajit Pawar: ఎన్నికల గుర్తు ‘‘గడియారం’’.. అదే గడియారంతో అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు..
నివేదికల ప్రకారం, జాంగ్ యౌషియా, లియు జెన్లీ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 18 రాత్రి జిన్ పింగ్‌ను అరెస్ట్ చేయాలని ప్రణాళిక రచించారు. అయితే, దీని అమలుకు 2 గంటల ముందు ఆపరేషన్ లీక్ అయింది. ఒక హోటల్‌లో ఉన్న జిన్‌పింగ్ అక్కడి నుంచి బయలుదేరారు. వెంటనే కుట్రదారుల్ని కౌంటర్ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కొన్ని నివేదిక ప్రకారం, జిన్‌పింగ్ ఉన్న హోటల్ వద్ద జిన్‌పింగ్ సెక్యూరిటీ, జాంగ్ వర్గానికి మధ్య తీవ్రమైన కాల్పులు జరిగినట్లు చెబుతున్నాయి.
జాంగ్ యౌషియా, లియూ జెన్‌లీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీని తర్వాత వీరి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారని, మరోవైపు జిన్‌పింగ్ తల్లి, సోదరికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. జిన్‌పింగ్ చేపడుతున్న మిలిటరీ ప్రక్షాళన కార్యక్రమాల వల్ల తాము కూడా టార్గెట్ అవుతామని చాలా మంది జనరల్స్ భావిస్తున్నారని, దీని వల్లే జిన్‌పింగ్ ను అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్ చేశారని తెలుస్తోంది.
విశ్లేషకుల ప్రకారం, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ నేతల్ని ధిక్కరించిన ఏకైక సంస్థ సైన్యమే అని యూఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో చైనా విశ్లేషకుడు డెన్నీస్ వెల్డల్ చెబుతున్నారు. జి జాంగ్ యౌషియా ను జిన్‌పింగ్ అంతర్గత ముప్పుగా భావిస్తున్నారని, సైన్యంలో జాంగ్ శక్తివంతుడు అవ్వడం అధ్యక్షుడికి ఇష్టం లేదనే వాదన కూడా ఉంది.