PM Modi: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలతో పాటు.. తెలంగాణలో లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నంది ఎన్నికల కమిషన్.. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా.. ఈ రోజు ఇవాళ నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు కావడంతో.. ఇంకా ఎవరెవరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు.. కొన్నిస్థానాల్లో రెబల్స్ నామినేషన్స్ వేయడంతో.. వారి ఉపసంహరించుకుంటారా? లేదా కొనసాగుతారా? బరిలో నిలిచే స్వతంత్రులు ఎంతమంది.. వెనక్కి తగ్గేవారు ఎవరు? ఇవాళ్టితో తేలిపోనుంది.
Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మరణించిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి.
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఐదేండ్లు తిరిగింది చేవెళ్ళలోని ఊర్లు కాదని.. టూర్లు అని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్తు యావత్ ప్రపంచాన్ని, చేవెళ్ళ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే.. ఆయన ఇంట్లో పడుకొని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు.