హైదరాబాద్(Hyderabad) నగరంలోని పలు చోట్ల మళ్లీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో మధ్యహ్నం నుంచి వర్షం మొదలైంది.
KTR: మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి స్వల్ప ఓటింగ్ తేడా తో బీఆర్ఎస్ ఓటమి అన్నారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కవితను ఇవాళ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో రిమాండ్ నేటితో ముగియనుంది.
తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని సీఈసీ షరతులు విధించింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఓ కీలక అప్డేట్ ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపనాలు మొదటగా తాకుతాయి. ప్రతియేటా మే 18 – 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం అవుతుంది. PM Modi: అవినీతికి అమ్మ కాంగ్రెస్… అభివృద్ధిని పట్టించుకోని…
Triple Talaq Case: 2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైనట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.