Atrocious: భర్త, అత్తపై కోడలు అరాచకం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది సామెత.. అంటే వీరిలో ఎవరో ఒకరు మాత్రం ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. లేదంటే రచ్చ రంబోలానే.. గతంలో అత్త, భర్త హవా నడిచేది. భర్త, అత్త కూర్చోమంటే కూర్చునేవారు.. నిలబడమంటే నిలబడేవారు.. అలా హుకుం జారీ చూస్తూ వారి పెత్తనాలు సాగుతుండేవి. అలా అని గడసరి కోడళ్లు కూడా లేకపోలేదండోయ్. అత్త, భర్త ప్రవర్తన, మాట తీరును బట్టి నడుచుకునే కోడళ్లు ఉన్నట్లే.. కోడలి నడవడికను బట్టి మారిన పొగరు అత్తలు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే. కానీ నేటి తరం కాస్త భిన్నంగా మారింది. ఉద్యోగాల పేరిట కొడుకులు దూర భారంగా ఉండటంతో కాస్తంత అత్త-భర్త-కోడలి పోరు తగ్గింది కానీ.. ఉంటే ఇళ్లు రణరంగమే అని చెప్పాలి. అలా అని అత్త-భర్తను హింసించే కోడళ్లు లేరా అంటే ఎందుకు లేరండోయ్ దీనికి ఇదిగో ఈ ఘటనే ఓ ఉదాహరణ. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, అత్తపై ఓ మహిళ హత్యాయత్నం చేయించిన బేగంబజార్‌లో కలకలం రేపింది.
Read also: భయంకరమైన తలనొప్పా.. ఈ చిట్కా ట్రై చెయ్యండి
Also Read
కట్టెల మండి సమీపంలో భర్త, అత్తపై భార్య, ఆమె బంధువులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తను చంపితే బీమా సొమ్ము అందుతుందని కోడలు ప్లాన్ చేసింది. దుండగులు ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశారు. డయల్ 100కు ఫోన్ చేసినా స్పందన లేదని బాధితులు చెబుతున్నారు. స్థానికులు చూస్తుండగానే నిందితులు కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. బాధితులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోవడం గమనార్హం.
Bear Carcass: కొమరంభీం జిల్లాలో ఎలుగుబంటి కళేబరం కలకలం..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..