రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది.
Southwest Monsoon Likely to hit Andaman Coast on May 19th: తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది అంతంత మాత్రంగానే కురిసిన వర్షాలు.. ఈ ఏడాది మాత్రం ఆశాజనకంగా ఉంటాయని తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ మాన్సూన్ రెయిన్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణ విదర్భ నుంచి కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద…
2009లో వచ్చిన ఫలితాలే.. 2024లో రిపీట్ అవుతాయి: పోలింగ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే.. ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల…
Maoists Press Note: చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టుల లేఖ విడుదల చేసింది.
తేరుకుంటున్న పల్నాడు: రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని…