Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు. రాష్ట్రంలోని ఈశాన్య మరియు తూర్పు జిల్లాలు, చుట్టుపక్కల కొన్ని జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు.
తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే నాలుగైదు రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని.. రానున్న నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ఇది కూడా చదవండి: Janvikapoor : పురివిప్పిన నెమలిలా జాన్వీ ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో చూశారా?
ఇక ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Hyd -Vijayawada Highway : హైదరాబాద్-విజయవాడ హైవేపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఇవే..!
ఇదిలా ఉంటే గురువారం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. డ్రైనేజీలు, నాలాలు ఏకమైపోయాయి. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు నరకం చూశారు. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది పరిస్థితుల్ని చక్కదిద్దారు. మరోసారి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
#WATCH | Director of Hyderabad Meteorological Center Dr K Nagaratna says, "Telangana is likely to have light to moderate rains and heavy rainfalls in few districts in and around the northeast and eastern districts of the state. South districts of Telangana are likely to have… pic.twitter.com/CQKYMD59D3
— ANI (@ANI) May 17, 2024
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు