Telangana: ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు మెడలో వస్తువులు కట్టేస్తున్నారు.
Telangana Rains: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణించలేదు. గురువారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి.
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
రుణమాఫీ పథకం విధివిధానాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో చర్చించారు. ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు.. మున్నగునవన్నీ ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొని, రైతులు పంటనష్టపోయిన సందర్భములో ఈ భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు. పథక అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు…
ఈరోజు హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.