తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు అంశం మరోసారి హాట్టాపిక్గా మారింది. ఈ విషయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి కీలకంగా చర్చించారు.
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు సమావేశంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ తయారు చేసిన క్యాడర్ ఇక్కడికి వచ్చింది.. మాగంటి గోపినాథ్ మూడు సార్లు మీ ఆశిస్సులతో గెలిచాడు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని నమ్మలేదు.. ఒక్కరిని కూడా బిఆర్ఎస్ మినహా ఎవరిని అసెంబ్లీ కి పంపలేదు..…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మిషన్ భగీరథా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. కాళేశ్వరంకి చెందిన ముమ్మడి రాకేష్ అనే తీర్థ్ర పురోహితుడుని గోదావరి వద్ద శ్రాద్ధకర్మ పూజలకు బ్రహ్మణ సంఘం సభ్యులు నిరాకరించారు.. దీంతో మనస్థాపం చెందిన రాకేష్ పెట్రోల్ బాటిల్ పట్టుకొని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానాని నిరసన తెలిపాడు. గత 3 సంవత్సరాలుగా గోదావరి వద్ద శ్రాద్ధ కర్మ పూజలు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు రాకేష్..…
నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు పోక్సో కేసులో సంచలన తీర్పునిచ్చింది. ఫోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 2018 లో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. విచారణ అనంతరం కోర్టు పై తీర్పును వెలువరించింది. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వేధింపులకు అడ్డుకట్టపడడం లేదు. ఎక్కడో ఓ…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంచిర్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. బండి సంజయ్ తోపాటు జెండా ఊపిన రాష్ట్ర మంత్రి జి.వివేక్, ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. వందేభారత్ రైలు ప్రారంభం సందర్భంగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మంచిర్యాలలో నేటి నుండి ‘‘వందే భారత్’’ హాల్టింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. జై బీజేపీ, జై బండి సంజయ్ నినాదాలతో మారుమోగిన మంచిర్యాల రైల్వే స్టేషన్..…
పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యా రెడ్డి మృతి చెందారు.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరు సరళమైసమ్మ టెంపుల్ వెళ్ళి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళుతుండగా ఇన్నోవా పల్టీ కొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి…
గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వీ కన్వెన్షన్ హాల్ పహారి గోడ సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి గా షెడ్లపై గోడ కూలడంతో…