బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం, శ్రీనివాస రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాల్సి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడంతో పాటు తెలంగాణ నుంచి ఎంపీకైన లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు వైరి పక్షమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యంగా సమాఖ్య స్ఫూర్తిని అనుసరించి కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
గుప్తనిధుల పేరుతో బడా మోసం చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 15 లక్షల 47 వేల నగదు, 540 వెండి రేకు నాణేలు, 76 బంగారు రేకు నాగ పడిగ బిల్లలు, పూజ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వివరాలను వెల్లడించారు.
తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని..చేరికల విషయంలో మనస్థాపం చెందానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు.